Saturday, April 17, 2010

తోటకాష్టకం




విధితాఖిల శాస్త్ర సుధాజలదే 

మహితోపనిషద్కధితార్ధనిధే 

హ్రిదయే కలయే విమలం చరణం
భవ శంకరదేశిక మే శరణం


సకల శాస్త్ర సారమనెడి అమ్రుతమును ఎరిగ ఓ తండ్రీ, మహిమాన్వితమైన ఉపనిసత్తుల సారముల నిధీ , మీ చరణములను నా 
హ్రుదయమందు పూజిస్తున్నాను నన్ను రక్షించు ఓ శంకరా


కరుణా వరుణాలయ పాలయమాం

భవ సాగర దు:ఖ విదూనహ్రిదం

రచయాఖిలదర్శన తత్వ విధం
భవ శంకరదేశిక మే శరణం


ఓ కరుణాసముద్రా ఈ భవసాగరం వల్ల కలుగు దు:ఖమునుండీ నన్ను రక్షించు, తత్వముల నిజఙ్ఞానాన్ని నాకు దర్శనమగునట్టు చేసి నన్ను కాపాడుము ఓ శంకరా


భవతా జనతా సు హితా భవితా

నిజబోధ విచారణ చారుమతే

కలయేశ్వర జీవవివేకవిధం
భవ శంకర దేశిక మే శరణం


మీ వల్లనే సకల జనులూ సంతోషం పొదుతున్నారు , ఓ ఙ్ఞానాన స్వరూపా నాకు ఆత్మా పరమాత్మల ఙ్ఞానాన్ని ప్రసాదించి కటాక్షించండి ఓ శంకరా


భవమేవ భవానితి మే నితరాం

సమజాయత చే తసి కౌ తు కితాం

మమ వారయమోహ మహాజలధిం
భవ శంకర దేసిక మే శరణం


ఆత్మవిద్యనిరిగిన ఓ పరమేశ్వరా నిన్ను మనస్సున స్మరిచి మహదానందం కలుగుతోంది, నన్ను ఈ భవసాగరాన్ని నుండీ రక్షించండి ఓ శంకరా


సుక్రుతే ధిక్రుతే బహుదా భవతో 

భవితా సమ దర్శన లాలసతా

అతిదీనమిమం పరిపాలయమాం
భవ శంకరదేశిక మే శరణం


జగదైకసత్యమైన మీలో మమేకమవ్వాలనే కోరిక అనేక ధర్మకార్యాలను అనేక విధాల ఆచరించడం వల్లనే కలుగుతుంది. నిస్సహాయుడనైన నన్ను రక్షించు ఓ శంకరా


జగతీమవితుం కలితా క్రితయో

విచరంతి మహామహ సచ్చలత:

అహిమామ్షు హ్రిదాత్త విభాసి గురో
భవ శంకరదేశిక మే శరణం


జగత్రక్షణకై అనేక గోప్యమైన రూపాలలో సంచైంచు మహాశక్తులన్నింటిలోకీ అఖండ భాస్కరుని వలే ప్రకాశించు ఓ శంకరా నన్ను రక్షించు


గురుపుంగవ పుంగవ కేతనతే 

సమతాం మయతాం నహి కోపి సుధీ:

శరణాగత వత్సల తత్వనిధే 
భవ శంకరదేశిక మే శరణం


గురువులకే గురువై సకల గురువులకూ మకుటాయమానమైన ఓ ఆది గురో, మీతో సమానమైన వారు లేరు. శరణాగతులను ప్రేమతో ఆదుకొనే కరుణానిధీ శంకరా నన్ను రక్షించు


విధితానమయా విషదైక కలా

నచకించన కాంచనమస్తి గురో

ద్రుతమేవ విధే హి క్రుపాంసహజాం
భవ శంకరదేశిక మే శరణం


ఙ్ఞాన మహా వ్రుక్షానికి ఉన్న ఒక్క శాఖని కూడా నేను అర్ధం చేసుకోలేదు, కొద్దిపాటి ఙ్ఞాన సంపద కూడా లేని నన్ను శ్రీఘ్రమే కరుణించి రక్షించుము ఓ శంకరా  !

   

1 comment: