హరి: ఓం
మూఖం కరోతి వాచాలం
పంగుం లంఘయతే గిరిం
యత్కృపా తవహం వందే
పరమానంద మాధవం
కృష్ణం వందే జగత్గురుం
శ్రీలీలాశుకులవారు రాసిన శ్రీకృష్ణ కర్ణామృతం ఓ అద్భుత గ్రంధ రాజము. ఏది ఆశ్వాదించిన కొద్దీ మరీంత ఆశ్వాదించాలనే అంత ఆందాన్నిస్తుందో అది అమృతం. అలాంటిది ఈ గ్రంధము కాబట్టే దీనికా పేరు పెట్టారు వారు. ఏరోజు భగవన్నామాన్ని స్మరిస్తామో ఆరోజు శ్రేష్టము అలా జీవితంలో అన్ని రోజులనీ శ్రేష్టం చేసుకోడానికి పనికొచ్చే నిత్యపారాయణీయ గ్రంధం ఈ శ్రీకృష్ణ కర్ణామృతం. ఆనందమే అమృతత్వం ప్రపంచంలో ఎన్నో వస్తువుల వల్ల మనకు ఆనందం పొందుతున్నా అది అనిత్యాలే, ఆ వస్తువు మీద కొంత కాలానికి విసుగుని పొందుతాము మనం కానీ ఏ ఆనందాన్ని పొందుతున్నామో దాని మీద ఎన్నటికీ విసుగు కలగదు. అలాంటి నిరంతర మనోరమమైన నిత్యమైన ఆనందఘనమే ఆ పరమాత్మ , ఆ శ్రీకృష్నుడు. ఆయన లీలలను వినిపించేదే ఈ శ్రీకృష్ణ కర్ణామృతం. ఆ లీలలను భక్తితో ఆశ్వాదిచింది మనో మాలిన్యాలను రూపుమాపి సాధనా మార్గంలోని అవరోధాలను ఆటంకాలనూ జయించి ఆ బృందావన విహారి చెంతకు చేరుదాం పదండి.
No comments:
Post a Comment