Tuesday, August 27, 2019

తారాశశాంకం


మహాభాగవతంలో వ్యాసుడు చెప్పిన కథ ఇది. ఈనాటికీ మానవాళికి ఎంతోగొప్ప సందేశాన్ని ఈ పురాణ కథ అందిస్తోంది. వివాహ సమయంలో వధూవరులకు ఈడూజోడూ కుదిరిందో లేదో చూసి పెళ్లి చేయటం తప్పనిసరని అని ఈడూ, జోడూ లేని వివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు కలుగుతాయని తారాశశాంకం అనే ఈ కథ తెలియజేస్తోంది. దేవతల గురువైన బృహస్పతి భార్య తార. బృహస్పతి వృద్ధుడు. తార వయస్సులో ఉంది. బృహస్పతి నిత్యం యజ్ఞయాగాది క్రతువుల్లో నిమగ్నమై ఉండేవాడు. తార తన భర్తకు సేవలందిస్తూ ఉండేది. కానీ ఆమె యవ్వనంలో ఉండటంతో శారీరకంగా ఆమెకు కలిగిన కోరికలు తీరటానికి వీలుకలిగేది కాదు. వయస్సుతో వచ్చిన కోరికలను అణుచుకోవటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఆమె భర్తసేవలో నిమగ్నమై ఉండేది. ఇలా కాలం గడుస్తుండగా బృహస్పతి దగ్గర విద్య నేర్చుకోవటం కోసం అత్రి మహామునికి, అనసూయకు బ్రహ్మదేవుడి అంశ వల్ల జన్మించిన చంద్రుడు వచ్చాడు. చంద్రుడు ఎంతో అందంగా ఉండేవాడు. నవమోహనాకారుడు, సుందరుడు అయిన చంద్రుడిని చూసి తార మోహంతో వివశురాలైంది. ఎంతో కాలంగా తీరకుండా ఉన్న కోరికలను తీర్చుకోవటానికి తార చంద్రుడికి దగ్గరైంది. బృహస్పతి తరచూ యజ్ఞయాగాల కోసం దేశాంతరానికి వెళ్లడం వీరికి వీలు కలిగించింది. ఇలా ఉండగా తార గర్భవతి అయింది. అప్పుడు చంద్రుడు తారను తన వెంట తీసుకొని వెళ్లిపోయాడు. ఎక్కడికో వెళ్లి తిరిగి వచ్చిన బృహస్పతి విషయమంతా తెలుసుకొని తనభార్యను తనకు ఇవ్వమని చంద్రుడిని అడిగాడు. కానీ చంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. ఆ కారణంగా చంద్రుడికి బృహస్పతికి ఘోరయుద్ధం జరిగింది. బృహస్పతికి బద్ధశత్రువైన రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చి చంద్రుడి పక్షాన చేరాడు. దాంతో గురుశిష్యుల మధ్యన జరుగుతున్న ఆ యుద్ధం దేవదానవ యుద్ధంగా మారింది. ఇలా దేవతలకు, రాక్షసులకు సాగుతున్న పోరు విరామం లేకుండా ఉండటంతో లోకాలన్నీ తల్లడిల్లాయి. ఈ విషయాన్ని బ్రహ్మ గమనించి దేవదానవులకు యుద్ధం తగదని వివరించి యుద్ధాన్ని విరమింపజేసి శాంతింపచేశాడు. తారను బృహస్పతికి ఇచ్చి పంపివేశాడు. ఆ తరువాత కొంతకాలానికి తారకు ఒక కుమారుడు కలిగాడు. మళ్లీ చంద్రుడు వెళ్లి ఆ కుమారుడు తనవాడేనని తనకు అప్పగించమని కోరాడు. ఆ సమయలో బ్రహ్మ, రుషులు వచ్చి తారనే స్వయంగా అడిగి ఆమెకు పుట్టిన బాలుడు చంద్రుడి కుమారుడేనని తార వల్ల తెలుసుకొని ఆ శిశువును చంద్రుడికి అప్పగించారు. ఆ చంద్రుడి కుమారుడే బుధుడు. అందంలో చంద్రుడిలాగా, బుద్ధిలో బృహస్పతిలాగా భాసిల్లే బుధుడు నవగ్రహాలలో ఒకడయ్యాడు. ఈ బుధుడు నిత్య యౌవ్వనుడు.

Sunday, August 18, 2019

సత్యహరిశ్చంద్రుడు


Image result for raja satya harischandra

భారతీయ పురాణ సాహిత్యంలో ఆదర్శవంతమైన చక్రవర్తిగా మానవాళికంతటికీ మార్గదర్శకుడుగా హరిశ్చంద్రుడు కనిపిస్తాడు. హరిశ్చంద్రుడి కథ మార్కండేయ పురాణంలో వివరంగా ఉంది. త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. సూర్యవంశ రాజుల్లో ఇతడు సుప్రసిద్ధుడు.

                           అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు. ఏకపత్నీవ్రతుడుగా, సత్యసంధుడుగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగిన ఒక సన్నివేశం హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలను పెట్టి, ఎన్నెన్నో మలుపులను తిప్పింది. ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వశిష్ఠుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. కానీ అక్కడ ఉన్న వశిష్ఠుడి బద్ధశత్రువు విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడుకాడు అని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని హరిశ్చంద్రుడితో ఎలాగైనా అబద్ధం ఆడిస్తానని అన్నాడు. 

                        అలా వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి పట్టుదల పెరిగింది. విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవటానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని దానికి ఎంతో ధనం అవసరమవుతుందని ఆ ధనం కావాలని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ విశ్వామిత్రుడు వెంటనే ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని అవసరం వచ్చినప్పుడ అడుగుతానని చెప్పి వెళ్లిపోయాడు. అలా జరిగిన కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్లాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరకు పంపాడు. ఆ కన్యలు తమ అందచందాలతో, సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశాడు. హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలని అనుకున్నాడు. అయితే ఆ కన్యలిద్దరు తమకు బహుమానాలు అక్కర లేదని తమను వివాహం చేసుకోమని కోరారు. కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్నీవ్రతుడినని, రెండోసారి పెళ్లిచేసుకోవటం ధర్మం కాదని ఆ కన్యలను పంపించాడు. విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంటపెట్టుకొని వచ్చి హరిశ్చంద్రుడిని వారి కోరిక తీర్చమన్నాడు. హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. తన రాజ్యాన్నయినా వదులుకుంటానని ఏకపత్నీవ్రతాన్ని విడిచి పెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు. వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్లిపొమ్మని, లేదా కన్యలను పెళ్లాడమన్నాడు. హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు. రాజ్యం సర్వస్వాన్ని కోల్పోయిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్రడు నిలదీసి గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని కొంత సమయమిస్తే ధనాన్ని చెల్లిస్తానని హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడిని వేడుకున్నాడు. అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవటానికి తన శిష్యుడైన నక్షత్రకుడు అనే వాడిని పంపాడు. హరిశ్చంద్రుడి వెనుకనే బయలుదేరిన నక్షత్రకుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాలపాలు చేశాడు. ‘సొమ్ము ఇస్తానని అనలేదు అని’ ఒక్క అబద్ధం చెప్పమని తాను వెంటనే వెళ్లిపోతానన్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలనుభవిస్తూ చివరకు కాశీ నగరానికి చేరాడు. అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలి ఉంది. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడు పోయి ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు. 

హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కాలకౌశికుడి ఇంట్లో కష్టాలను అనుభవిస్తూ ఉండగా, అడవికి దర్భల కోసం వెళ్లిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. తన కుమారుడు మరణించాడని తెలుసుకొని ఆ శవాన్ని అంత్యక్రియలు చేయటానికి శవాన్ని తీసుకొని చంద్రమతి స్మశానికి వెళ్లింది. అక్కడ వీరబాహుడికి సేవకుడిగా, కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయనీయలేదు. కాటి సుంకం చెల్లించితీరాలని చంద్రమతిని పట్టుబట్టాడు. తన దగ్గర చిల్లిగవ్వ కూడా ధనం లేదని, కాటి సుంకం కట్టలేనని అంది. అప్పుడు హరిశ్చంద్రుడు అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని హరిశ్చంద్రుడన్నాడు. ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరొకరెవరికీ కనపడదని అది తనకు వరమని కనుక కాటికాపరిగా ఉన్నవ్యక్తి హరిశ్చంద్రుడే అయివుంటాడని అనుకుని అప్పుడు తన విషయాన్నంతా చంద్రమతి హరిశ్చంద్రుడికి చెప్పింది. 

                              విషయం తెలుసుకుని ఎంతో బాధపడిన హరిశ్చంద్రుడు తన విధి నిర్వహణనను మాత్రం అమ్మలేదు. మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని నగరానికి పంపాడు. అంత రాత్రివేళ చంద్రమతి నగరంలోకి వెళుతుండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుడిని ఎవరో దొంగలు చంపి, అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతుండగా రాజభటులు ఆ దొంగలను చూసి తరుముకురాసాగారు. ఆ దొంగలు పరుగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాకుమారుడిని హత్యచేసి ధన్నాన్ని దొంగిలించిదని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు ఆమెకు మరణదండన విధించటంతో రాజభటుల ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజు ఆజ్ఞను హరిశ్చంద్రుడు అమలుపరిచాడు. అయితే హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగవేయబోగానే విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది. వెంటనే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడులాంటి రుషులు అక్కడకు వచ్చి చేరి అబద్ధం ఆడని, ధర్మం తప్పని హరిశ్చంద్రుడిని ఎంతగానో ప్రశంసించారు. విశ్వామిత్రుడు ఓడిపోయానని ఒప్పుకోవటంతో హరిశ్చంద్రుడి మీద దేవతలంతా పుష్పవృష్ఠి కురిపించారు. ఇలా హరిశ్చంద్రుడు సర్వమానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు. సత్య నిరతిని తప్పక సత్యహరిశ్చందృడిగా పేరు పొందాడు.



Saturday, August 10, 2019

హింస - అహింస

Image result for dharmavyadha


మనిషి మనసును వేధించే ధర్మసందేహాలను తీర్చే మహాగ్రంధంగా మహాభారతానికి మంచి పేరుంది. మనిషికి కలిగే ధర్మ సందేహాల్లో హింస, అహింసల తారతమ్యం ఎలా ఉంటుందనేది ప్రధానమైనది. ఒకప్పుడు కౌశికుడు అనే మునికి కూడా హింసకు అహింసకు తేడా తెలుసుకోవాలనిపించింది. దీనికి కారణం ధర్మవ్యాధుడు అనే కసాయివాడు త్రికరణశుద్ధిగా ధార్మికుడుగా కనిపించడమే. ‘నీవు మాంసం అమ్ముతూ జీవిస్తున్నావు కదా? అది హింస కాదా? దానివల్ల పాపం రాదా?’ అని కౌశికుడు ఆ కసాయివాడిని ప్రశ్నించాడు. అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మవ్యాధుడు సమాధానాలు చెప్పిన సారాంశంలో అహింసా స్వరూపం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓ కౌశికమునీ ఈ లోకంలో ప్రాణుల మరణం అనేది వాటి పూర్వజన్మకర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. చంపేవాడు కేవలం నిమిత్తమాత్రుడేననేది వారి భావన. అసలు ఈ జగత్తును సృష్టించినప్పుడే బ్రహ్మదేవుడు కొన్ని కొన్ని ప్రాణుల కోసం మరికొన్ని జంతు, మృగ సమూహాలను సృష్టించాడని, అలాగే పండ్లు, కూరగాయలు, దుంపలు వంటి వాటిని కూడా ఆహార పదార్థాలుగా సృష్టించాడని వేదాలు ఘోషిస్తున్నాయి. హింస అన్ని సందర్భాల్లో హింసలాగా కనిపించదు. తన శరీరాన్ని కోసి అగ్నికి, ఇంద్రుడికి ఆహారంగా ఇచ్చిన శిబి చక్రవర్తికి పాపం కలగడానికి బదులు, పుణ్యలోక ప్రాప్తి కలిగింది. నిష్టాగరిష్ఠులైన వారు యజ్ఞాలను చేసేటప్పుడు పశువులను బలి ఇస్తుంటారు. ఇది పైకి హింసలాగే కనిపిస్తుంది. కానీ వారికి ఎవరికీ పాపం అంటడం లేదు. రైతు పొలాన్ని దున్నేటప్పుడు అతడి నాగటి కొనకు తగిలి వేలాది జీవులు మరణిస్తుంటాయి. కానీ ఆ హాలికుడికి పాపం అంటడం లేదు. మనుషులు నడిచేటప్పుడు వారి కాళ్ల కింద పడి అనేక ప్రాణులు నశిస్తుంటాయి. భూమి, ఆకాశం, నీరు అంతా జలమయమే కదా! కనుక మనిషైనవాడు తన జీవన యాత్ర సాగించేటప్పుడు ఏదో ఒక సందర్భంలో హింస చేయక తప్పదు. కానీ ఇవన్నీ తెలియని కొందరు తాము హింస చేయడం లేదని అనుకుంటూ ఉంటారు. అది ఒట్టి భ్రమ మాత్రమే. పనిగట్టుకుని అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ మేము హింసకు దూరంగా ఉన్నామని అనుకునే వారు కూడా ఆహారం కోసం చెట్ల ఆకులను, దుంపలను కోసేటప్పుడు ఆ చెట్లను హింసిస్తూ హింసకు పాల్పడుతున్నట్లే లెక్క కనుక వీటన్నిటినీ గమనిస్తే హింస చేయని వాడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేనట్లే కదా అని ధర్మవ్యాధుడు అన్నాడు. మరి అహింస అనేది ఎలా ఉంటుందని మళ్లీ ముని ప్రశ్నించాడు. ఎవరికి వారు తమకు సాధ్యమయినంత వరకు హింసకు దూరంగా ఉండటమే అహింస అని చెప్పవచ్చని ధర్మవ్యాధుడు కౌశికమునికి వివరించాడు.









- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు

- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Wednesday, August 7, 2019

త్య్రంబకం


Image result for nasik

అలల సవ్వడిలో సప్తస్వర స్వనాలను సమ్మిళితం చేస్తూ రాజమహేంద్రి కాంతకు మణిమేఖలలా భాసిల్లుతూ పరవళ్ళు తొక్కుతూ పరవశించి పోతూ, ఉరవళ్ళు తొక్కుతూ ఉత్సాహంతో సాగుతూ సాగర సంగమం చేస్తున్న గోదారితల్లి పుట్టిల్లు మహారాష్ట్రలోని నాసిక్‌ దగ్గర ఉన్న త్య్రంబకం.  తన పుట్టుకలోనే ఓ పవిత్రతను, ఓ సామాజిక ప్రయోజనాన్ని నింపుకుని అవతరించిన గౌతమీ మాత రాజమహేంద్రి దాకా సాగి మధ్య మధ్యలో ఎన్నెన్నో తీర్ధాలను ఉపనదులను కలుపుకుని సప్తరుషుల పేర్ల మీద ఏడు పాయలుగా ఎగసి పడుతున్న ఆనందంలా సాగర సంగమానికి ఉరుకులెత్తటం చూస్తుంటూనే గుండెనిండా ఆనందం గంతులేస్తుంటుంది. గోహత్య మహాపాపాన్ని ప్రక్షాళన చెయ్యటానికి పరమేశ్వరుడి శిరస్సునుండి దూకి వచ్చిన ఈ గంగను(గౌతమి) తాకిన వారందరికీ తరతరాల పాపం నశించి పుణ్యం ఒకటికి పది రెట్లు చేకూరుతుందన్నది ఆస్థిక జన భావన. ఈ గౌతమి ఆవిర్భావానికి, అక్కడే పరమేశ్వరుడు త్య్రంబకేశ్వరుడై జ్కోతిర్లింగ రూపంలో వెలుగొందటానికి కారణమైన ఓ కథ స్థల పురాణంగా ప్రచారంలో వుంది. 
Image result for trayambakeshwar
(త్రయంబకేశ్వర ఆలయం)
             అంతేకాక అష్టాదశ పురాణాలలో ఒకటైన శ్రీ శివమహాపురాణంలో త్య్రంబకేశ్వర మహత్యం అనే పేరున కూడా ఒక కథ కనిపిస్తుంది. కొందరు రుషులు గౌతమ మహర్షికి గోహత్యా పాపం సంక్రమించేలా చేసి ఆ పాపం పోవటానికి పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో గంగను భూమి మీదకు తీసుకు రమ్మనమని చెప్పారు. గౌతముడు అలాగే చేశాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆయన శిరస్సు నుండి నేల మీదకు వచ్చిన గంగ వెంటనే ఒక స్త్రీ రూపాన్ని ధరించి అక్కడ ప్రత్యక్షమైంది. అప్పుడు గౌతముడు ఆమెకు నమస్కరించి తన వెంట వచ్చి పాపప్రక్షాళన చేయమని కోరాడు. పరమేశ్వరుడు కూడా ఆమెను అలాగే చెయ్యమని ఆజ్ఞాపించాడు. కానీ గంగ కేవలం గౌతమ ముని పాపాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ వెంటనే తిరిగి తన స్థానానికి తాను చేరుకుంటానని చెప్పింది. కానీ భక్తవత్సలుడైన మహేశ్వరుడు మానవలోకానకి ఉపకారం చెయ్యాలని అనుకుని సూర్యుడి కుమారుడు ఇరవై ఎనిమిదవ మనువుగా పాలనలోకి వచ్చేంత వరకూ భూమి మీదే వుండమని ఆజ్ఞాపించాడు. అందుకు గంగ భూలోకంలో తనకు అందరి కన్నా, అన్నిటికన్నా విశేషశక్తిని కలిగించటం దానితోపాటు పరమేశ్వరుడు కూడా పార్వతితోనూ, శివగణాలతోనూ కూడి తన సమీపంలోనే ఉన్నట్లైతే తాను భూలోకంలో వుండటానికి ఎటువంటి అభ్యంతరం లేదని, తనకు ఆ వరాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆమె మాటలను పరమేశ్వరుడు కాదనలేకపోయాడు. గంగను ఈశ్వరుడు అలా అనుగ్రహించిన వెను వెంటనే అక్కడికి దేవతలు, రుషులు అనేక తీర్ధాల సమూహాలు వచ్చి చేరాయి. వారంతా పరమేశ్వరుడికి గంగకు, గౌతముడికి జయ ధ్వానాలు పలికారు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు తదితర దేవతలంతా ముక్త కంఠంతో పరమేశ్వరుడిని స్తుతించారు. ఈశ్వరుడప్పుడు ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి ఆ దేవతలంతా కూడా భూమి మీద అవతరించిన గంగను భూమి మీదే వుండేలాగా చెయ్యమని ప్రార్ధించారు. అయితే అంతలోనే గంగాదేవి కల్పించుకుని ఆ దేవతలంతా కూడా ఎందుకు భూమి మీదే వుండకూడదని అన్నది. అయితే వారు ఆమెకు సమాధానమిస్తూ ‘‘ సింహరాశౌ యదా స్యాద్వై గురుస్సర్వ సుహృత్తమఃతదావయం చ సర్వే త్యాగ మిష్యామో న సంశయంఏకాదశ చ వర్షాణి లోకానాం పాతకం త్విహంక్షాలితం యద్భవేదేవం మలి నాస్స్మ గురి ద్వరే’’గురువు ఎప్పుడు సింహరాశిలో వుంటాడో అప్పుడు తామంతా నిశ్శంసయంగా గంగలోకే వచ్చి వసిస్తామని చెప్పారు. పదకొండు సంవత్సరాలపాటు తామంతా మానవుల పాపాలను ప్రక్షాళనం చేసే పనిలో నిమగ్నమై ఉండి పన్నెండవ సంవత్సరంలో తమ మాలిన్యాన్ని పోగొట్టుకునేందుకే ఇలా వస్తున్నట్లు కూడా చెప్పారు. సింహంలో గురుడు వున్నంతవరకు తాము గంగలో వుంటామని, అప్పుడు శంకురుడిని దర్శించి తమ పాపాలను కడిగేసుకుంటామని ఆ తరువాత కూడా గంగ అనుమతిని పొంది మాత్రమే తమ తమ నెలవులకు వెళ్తామని దేవతలంతా గంగాదేవికి చెప్పారు. ఆ మాటలకు గంగ ఎంతో సంతోషించింది. ఆనాటినుండి ఆ ప్రదేశంలో పరమేశ్వరుడు తన గణాలతోనూ, పార్వతితోనూ త్య్రంబకేశ్వరుడుగా అవతరించాడు. సంస్కృత భాషలో అంబకము అనే పదానికి కన్ను అనే అర్ధం ఉంది. మూడు కన్నులు గలవాడు కనుక ఆయన త్య్రంబకుడయ్యాడు. గంగ కూడా ఆనాటినుండే గౌతమిగా మారిపోయింది. అంటే గౌతమ మహర్షి తపస్సు చేయగా అవతరించిన కారణంగా ఆ పేరు స్థిరపడింది. ఆనాటినుండే గురువు సింహరాశిలో వుండగా సర్వతీర్ధాలు, దేవతలు అక్కడకు రావటం ప్రారంభించారు. అదే పుష్కర సుమయమైంది. అలా గౌతమీనది అవతరణ, త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం జరిగినట్లుగా శివపురాణంలోని గౌతమి మహాత్యం అనే కథ వివరిస్తుంది. త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలో ఉంది. ఈ నాసిక్‌కు కూడా స్థల పురాణముంది. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో బ్రహ్మగిరికి సమీపంలో వుండగా శూర్పణఖ తారసిల్లింది. ఆమె ఆగడాలను సహించలేని లక్ష్మణుడు ఆమె నాసికను, చెవులను ఇక్కడే ఖండించాడని ఆ కారణంగానే ఈ ప్రదేశానికి నాసిక్‌ అని పేరు వచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు.













శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Saturday, August 3, 2019

కేశవుడు

Image result for sri krishna dhenukasura

శ్రీకృష్ణావతారం దాల్చిన శ్రీమహావిష్ణువుకు ఆయన చేసిన గొప్ప గొప్ప పనుల ఆధారంగా అనేకానేక నామాలు వచ్చాయి. భాగవత కథాకథనాన్ని అనుసరించి గోకులంలో పెరుగుతున్న బాలకృష్ణుడిని ఎలాగైనా సంహరించాలని కంసుడు ఎప్పటికప్పుడు పథకాలు పన్నుతూ ఉండేవాడు. కంసుడి దురాలోచనలకు అతడి మిత్రులైన రాక్షసులు సహకారం అందిస్తుండేవారు. అయితే ఈ రాక్షసులంతా ఏదో ఒక విధంగా బాలకృష్ణుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలా జరిగినప్పుడల్లా గోకులంలోని గోపాలురకు, కంసుడికి కూడా ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. పసిబాలుడు మహాబలవంతుడైన రాక్షసులను ఎలా సంహరించగలుగుతున్నాడని వారంతా విస్తుపోతుండేవారు. అయితే తాను సామాన్య మానవుడిని కానని కారణజన్ముడినని తెలియచెప్పటం కోసం కృష్ణుడి లీలలు సాగుతూ ఉండేవి. ఒకసారి కంసుడు తన స్నేహితుడైన కేశి అనే రాక్షసుడిని కృష్ణ సంహారం కోసం పంపాడు. కేశి ఒక గుర్రం రూపంలో గోకులంలో ప్రవేశించాడు. ఆ గుర్రం భీకరాకృతిని కలిగి ఉండి దాని సకిలింతలు అందరినీ భయపెట్టాయి. ఆ గుర్రం కదలికలతో గోకులంలోని వారందరూ భయకంపితులయ్యారు.


ఆ గుర్రం చివరకు కృష్ణుడి కంట్లో పడింది. అది సాధారణమైన గుర్రం కాదని రాక్షసుడని కృష్ణుడు గ్రహించాడు. వెంటనే ఆ గుర్రం మీదకు లంఘించాడు. ఆ గుర్రం కోపావేశంతో ముందరి కాళ్లను ఎత్తి గట్టిగా కృష్ణుడిని తన్నింది. అయితే ఏమాత్రం ఆ దెబ్బకు చలించక దాని ముందరి రెండు కాళ్లు పట్టి ఒక్కసారి విసురుగా పైకెత్తి ఆ గుర్రాన్ని నేలకేసి కొట్టాడు కృష్ణుడు. ఆ దెబ్బతో ఆ రాక్షసుడు కొద్దిసేపు అచేతనంగా నేల మీద పడినా మళ్లీ వెంటనే శక్తిని పుంజుకుని కృష్ణుడి మీదకు దూకాడు. ఈసారి శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని ఆ గుర్రం నోట్లో గట్టిగా తిప్పడంతో వాడిగా ఉన్న దాని దంతాలన్నీ జారి నేల మీద పడ్డాయి. గుర్రం నోట్లో ఉన్న కృష్ణుడి చెయ్యి క్షణక్షణానికి ఉబ్బినట్లుగా అయి కేశికి ­పిరాడలేదు. వెంటనే ఆ రాక్షసుడు నోరు చీలి కిందపడి చచ్చాడు. రాక్షసుడి పీడ విరగడ కావడంతో గోపాలకులంతా ఆనందంతో పొంగిపోయారు. ఇలా కేశి అనే రాక్షసుడు సంహరించడం వల్లనే శ్రీకృష్ణుడికి కేశవుడు అనే పేరు వచ్చింది. కంసుడు పంపిన రాక్షసుల్లో అరిష్టుడు అనే రాక్షసుడు భయంకరమైన వృషభ రూపంలో వచ్చి కృష్ణుడిని వధించాలని ప్రయత్నించగా ఆ వృషభాసురుడిని కూడా అవలీలగా కృష్ణుడు సంహరించాడు. అలాగే వ్యోమాసురుడు అనే రాక్షసుడు కృష్ణ సంహర లక్ష్యంతో వచ్చాడు. ఆ రాక్షసుడు మయుడికి కుమారుడు. ఎన్నో మాయలు సృష్టిస్తూ గోప బాలకులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఒకరోజున వాడు గోపబాలకులందరినీ బంధించి తీసుకువెళ్లి ఒక కొండ గుహలో దాచిపెట్టి ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండరాయితో మూసివేశాడు. కృష్ణుడు ఈ విషయాన్ని గ్రహించి వ్యోమాసురుడి మీదకు వెళ్లాడు. ఆ రాక్షసుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచి తన బలానంతా ప్రదర్శించాడు. అయితే కృష్ణుడు ఎంత మాత్రం చలించకుండా ఆ రాక్షసుడిని పట్టి తన భుజబలంతో మట్టి కరిపించాడు. ఆ తరువాత గుహ ద్వారానికి అడ్డంగా పెట్టి ఉన్న బండను తొలగించి గోప బాలకులందరినీ రక్షించాడు. ఇలా చిన్నతనంలోనే బాలకృష్ణుడు తన ఎన్నెన్నో మాయలను చూపి శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేశాడు.



- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు

- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Wednesday, July 31, 2019

గరుత్మంతుడు

Related image


ప్రత్యక్ష దైవాల వంటి తల్లిదండ్రుల పొందగలిగిన తనయులు సర్వత్రా జయాలనే పొందుతుంటారని గరుత్మంతుడి వృత్తాంతం మహాభారతంలో వివరిస్తోంది. వినతకు రెండో సంతానంగా జన్మించిన గరుత్మంతుడు అప్పటికే ఆమె కద్రువకు, ఆమె సంతతికి దాస్యం చేస్తుండడం చూసి ఎలాగయినా తల్లి దాస్యాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు గరుత్మంతుడు తన దగ్గరకు వచ్చిన సర్పాలని చూసి నా తల్లి దాస్యం, నా దాస్యం విముక్తి కావడానికి మీరు ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. ‘మాకు అమృతం తెచ్చిపెట్టు మీ దాస్యం విముక్తి అవుతుంది’ అని వారు పలికారు. వెంటనే గరుత్మంతుడు తల్లి వినత దగ్గరకు వెళ్లి నమస్కరించి విషయం చెప్పి తనకు ఆకలిగా ఉందని ఆహారం ఇవ్వమని ప్రార్థించాడు. ఆమె చాలా సంతోషించి సముద్రంలో ఉన్న నిషాదులను మాత్రం తిని ఆకలి తీర్చుకొనమని ఆశీర్వదించింది. గరుత్మంతుడు తల్లి చెప్పినట్లు చేశాడు. కాని ఆకలి తీరలేదు. వెంటనే తన తండ్రి కస్యప ప్రజాపతిని ప్రార్థించాడు. ఆయన పరస్పరం శాపాలను పెట్టుకుని ఏనుగు, తాబేలుగా మారిన విభావనుడు, సుప్రతీకుడు అనే వారిని భక్షించి ఆకలి తీర్చుకొమ్మన్నాడు. భారీకాయాలతో ఉన్న ఆ రెంటిని ఒక పెద్ద చెట్టు కొమ్మమీద పెట్టుకుని భక్షించాలనుకుని కాలు మోపబోగా ఆ చెట్టు కొమ్మ ఫెళఫెళ విరిగింది. ఆ కొమ్మకు బొటనవేలు పరిమాణంలో ఉండి తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలఖిల్యులు అనే మునులు ఉన్నారు. వెంటనే కొమ్మను పట్టుకొని తన తండ్రి దగ్గరకు గరుత్మంతుడు వెళ్లాడు. వాలఖిల్యులు గరుత్మంతునిమీద బాగా కోపించారు. అయితే విషయాన్ని వివరించి గరుత్మంతుడు తన కుమారుడేనని పట్టుదలతో అతను తన తల్లి దాస్యం తీర్చడానికి స్వర్గలోకం నుంచి అమృతభాండం తేవడానికి వెళుతున్నాడని, దయతో కోపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు వాలఖిన్యులు సంతోషించి గరుత్మంతుని శపించకుండా హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. ఆ తరువాత తండ్రి సూచన మేరకు చెట్టుకొమ్మను హిమాలయాలకు తీసుకుని వెళ్లి విడిచి ఏనుగు, తాబేలును భక్షించి అమృతభాండం కోసం స్వర్గలోకానికి వెళ్లాడు. ఇలా తలిదండ్రుల ఆశీస్సులతో కష్టాలను అధిగమించి గరుత్మంతుడు కార్యసాధకుడయ్యాడు.






శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Saturday, July 27, 2019

శివాజి గణేశన్ ఔదార్యం

Image result for sivaji ganesan donate elephant


మీరు ‘తిరువరుత్ చల్వర్’ సినిమాలో అప్పర్ (63 నాయనార్లలోని నాల్వర్లు సుందర్, అప్పర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ లలో ఒకరు) గా చేశారు. ఆ దృశ్యాలు ఇప్పటికి మామనస్సులో ముద్రవేశాయి. ఈ పాత్ర చెయ్యడానికి మీకు కంచి పరమాచార్య స్వామివారు ప్రేరేపణ అని చెప్పారు కదా! అది కొంచం వివరిస్తారా? అని ఒక పాత్రికేయుడు శివాజి గణేశన్ ని అడిగాడు.

నటనలో రాణించాలంటే నటులకు సూక్ష్మపరిశీలన చాలా అవసరం అని నా అభిప్రాయం. నేను నా చుట్టూ ఉన్న పరిసరాలని, వ్యక్తులని బాగా గమనిస్తుంటాను. నేను అప్పర్ గా నటించాను కాబట్టి, ఒక పాతకాలంనాటి శివభక్తుని గుణాలను చూపించాలి, అతని వేషధారణ, ఆహార్యము మొదలైనవి.

పరమాచార్య స్వామివారు నన్ను దర్శనానికి రమ్మన్నారని నాకు ఒకరోజు శంకరమఠం నుండి కబురు వచ్చింది. అప్పుడు స్వామివారు మైలాపూర్ లోని మఠంలో ఉన్నారు. నాకు సరిగ్గా గుర్తుంటే ఆ మఠం కర్పగాంబళ్ కళ్యాణమంటపం పక్కనే ఉంటుంది.

నేను, నా భార్య, అమ్మానాన్న నలుగురం కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. మేము మఠానికి వెళ్ళగానే మమ్మల్ని ఒక గదిలో కూర్చోమని చెప్పారు. దాదాపు ఒక గంటసేపు ఉన్నాము అనుకుంటా. అప్పుడు స్వామివారి ఎదో ఉపన్యాసం చెబుతున్నారు. హఠాత్తుగా కరెంటు పోవడంతో అంతా గాఅఢాంధకారంగా మారిపోయింది.

స్వామివారు చేతిలో ఒక చిన్న దీపంతో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. నిదానంగా కూర్చుని కళ్ళపైన చేతులనుంచుకొని మా వైపు చూస్తున్నారు.

”నువ్వు శివాజి గణేశన్ కదూ?” అని అడిగారు.

”అవును స్వామి నేనే” అని బదులిచ్చి నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నాను. అమ్మానాన్న, నా భార్య కూడా స్వామికి నమస్కరించారు.

“మిమ్మల్నందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది” అన్నారు స్వామి. తారువాత స్వామివారు:

“నేను తిరుపతి, తిరువణైక్కావల్, తంజావూరులోని పున్నైనల్లూర్ మారియమ్మన్ దేవాలయం వంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఆలయ ధర్మకర్తలు నాకు ఏనుగుల చేత పుష్పమాలలు వేయించారు. దేవస్థానానికి ఈ ఏనుగులని ఎవరు ఇచ్చారు అని అడిగగా వారు ‘శివాజి గణేశన్’ అని చెప్పారు.

దేశంలో చాలామంది ధనవంతులున్నారు. ప్రచారం కోసం వారు దేవాలయాలకు ధనం ఇస్తారు. కాని దేవాలయాలకు ఏనుగులను ఇవ్వాలంటే దానికి ఉదారమైన గుణం ఉండాలి. అది నీలో ఉంది.

నిన్ను కన్న నీ తల్లితండ్రులు అదృష్టవంతులు. మీ తల్లితండ్రుల కోసం నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను.” అని చెప్పి స్వామివారు లేచి లోపలికి వెళ్ళారు.

ఆ సమయంలో నేను ఎంత ఆనందానికి లోనయ్యుంటానో ఆలోచించండి. ఎంతటి ఆశ్చర్యకరమైన అనుగ్రహం అది! అలోచించండి ఒకసారి.

చెప్పలంటే నాకు జీవితంలో భయం అనేది లేదు. భయం అన్నది నేనెరుగను. ప్రత్యేకించి నాకు స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి. అంతా వారు చూసుకుంటారు.

బహుశా ఈ సంఘటన నాపైన ప్రభావం చూపింది అనుకుంటా. స్వామివారు అలవాట్లని చాలా క్షుణ్ణంగా గమనించాను. కాబట్టి ఆ సూక్ష్మ పరిశీలన వల్లే ఆ సినిమాలో అప్పర్ లా నటించగలిగాను.

--- ‘నడిగర్ తిలగమ్’ శివాజి గణేశన్ ఆత్మకథ నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, July 24, 2019

అయ్యంగార్ స్వామి అలక


Related image
ప్రతి శుక్రవారం కంచి మఠంలో విద్వత్ సదస్సు జరుగుతుంది. పండితులందరూ వివిధ విషయలపైన చర్చించుకుంటారు. చివరికి పరమాచార్య స్వామివారు చివరిగా వివరణ ఇస్తారు. అలాగే పండితులందరికి స్వామివారు సన్మానం అంటే దక్షిణ ఇస్తారు.

అలాంటి ఒకరోజున చిన్నకాంచీపురం నుండి ఒక అయ్యంగారు పండితులు వచ్చారు. పరమాచార్య స్వామికి నమస్కారములు చేసి స్వామివారు ఇచ్చిన డబ్బులను తీసుకున్నారు. కాని దానితో అతను తృప్తి చెందలేదని అతని హావభావాలు చెబుతున్నాయి. మహాస్వామి వారు దాన్ని గమనించి, “ఏమి అయ్యంగార్ స్వామివారు సంతోషమే కదా?” అని అడిగారు. ఆయన అవును అని ముభావంగా చెప్పి వెళ్ళిపోయారు.

మిగిలిన పండితుల తరువాత సామాన్య భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. మొదట ఉన్నది కుటుంబంతో సహా ఉన్న ఒక న్యాయవాది. ఆయన ఒక పళ్ళెంలో పళ్ళు, పూలు, జీడిపప్పు మొదలైనవి తీసుకుని వచ్చి స్వామివారి ముందు పెట్టి “పెరియవ ఒక విన్నపం” అని అన్నాడు.

మహాస్వామివారు అతణ్ణి ఊరకే ఉండమని చెప్పి, ఒక శిష్యుణ్ణి పిలిచి “వెళ్ళి ఆ అయ్యంగార్ స్వామిని పిలుచుకుని రా. చిన్న కాంచీపురం వెళ్ళడానికి బస్సులో కూర్చుని ఉంటాడు” అని చెప్పారు. ఆ శిష్యుడు గంగై కొండన్ బస్టాండుకు వెళ్ళి చూడగా ఒక బస్సులో కూర్చుని కనిపించారు. మహాస్వామివారు తనను రమ్మన్నారని ఆ అయ్యంగార్ స్వామితో చెప్పాడు ఆ శిష్యుడు.

”నేను ముప్పై పైసలు పెట్టి టికెట్టు కొన్నాను. నేను ఇప్పుడు అక్కడికి వస్తే నాకు ముప్పై పైసలు నష్టం” అని చెప్పాడు ఆ స్వామి. దీన్నంతా గమనిస్తున్న బస్ కండక్టరు వెంటనే, “ఏంటి స్వామి, పరమాచార్య దర్శనం కోసం దేశవిదేశాల నుండి వస్తారు. మీరు చూస్తే స్వామివారే రమ్మంటుంటే వెళ్ళనంటున్నారు. ఆ టికెట్టు ఇలా ఇవ్వండి మీ ముప్పై పైసలు మీకు తిరిగిస్తాను. ఏదో ముఖ్యమైన విషయమేమో, వెళ్ళి స్వామివారి కలవండి” అని చెప్పాడు.

ఆ అయ్యంగార్ స్వామి టికెట్టు వెనక్కిచ్చి, ముప్పై పైసలు తీసుకుని బస్సు దిగి ఆ శిష్యుడితో పాటు వెళ్ళాడు స్వామివారిని చూడటానికి. మహాస్వామివారు నవ్వుతూ, “ఏమి అయ్యంగార్ స్వామివారు! మీ ముప్పై పైసలు త్రిగివ్వకపోతే బస్సు దిగి ఇక్కడికి రారా ఏమి?” ఇది విని అతను నోరెళ్ళబెట్టాడు. స్వామివారికి ఎలా తెలుసు ఆ విషయం?

పక్కనున్న న్యాయవాది మళ్ళీ మొదలెట్టాడు, “పెరియవ ఒక విన్నపం . . ”

మహాస్వామివారు ఉండు అని చెప్పి అయ్యంగార్ స్వామిని న్యాయవాది పక్కన కూర్చోమన్నారు. ఆ స్వామి చిరునామా తీసుకోవలసిందిగా ఆ న్యాయవాదికి చెప్పారు. తరువాత ఆయ్యంగార్ స్వామితో, “తరువాతి బస్సు సిద్ధంగా ఉంది వెళ్ళమని చెప్పారు”

అతనికి ఏమి అర్థం కాక వెళ్ళిపోయాడు.

న్యాయవాది మరలా, “పెరియవా. . .” అని మొదలు పెడుతుండగా స్వామివారే “ఏమప్పా! ప్రతి నెలా వేదం చదివిన ఒక పేద బ్రాహ్మణుడికి కొంత ధనం ఇవ్వాలి అని కదా అనుకుటున్నావు. అంతేనా?” అని అడిగారు. అతను కొద్దిసేపు చేష్టలుడిగి తరువాత తేరుకుని, “అవును పెరియవ” అని బదులిచ్చాడు.

“నీకు తెలుసా, నేను ఆ అయ్యంగార్ స్వామి చిరునామా తీసుకోమన్నది అందుకే. ప్రతి నెలా మరువకుండా రూ.250/- పంపు. నువ్వు కొద్ది నెలల తరువాత నిలిపివేస్తే అతను మరలా ఇక్కడకు వస్తాడు. అతను చాలా మంచివాడు, పండితుడు. కాని పేదవాడు అంతే” అని చెప్పారు.

న్యాయవాది అందుకు ఒప్పుకుని, కుటుంబ సమేతంగా స్వామివారికి సాష్టాంగం చేసి వెళ్ళిపోయారు. ఆ అయ్యంగార్ కి స్వామి ప్రతినెలా డబ్బు అందుతోందా లేదా అని తమ శిష్యుల ద్వారా కొన్ని నెలల పాటు విచారణ చేశారు స్వామివారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, July 20, 2019

శ్రేష్టిదార్ అని పిలవొచ్చునా?

Image result for sri chandrasekharendra saraswathi mahaswamy

నేను కాంచీపురంలోనే ఉండడంవల్ల ప్రతిరోజూ మహాస్వామివారి దర్శనభాగ్యం దొరికేది. ఒకసారి శ్రీమఠంలో ఎదో ఆరాధన సoదర్భoగా కావల్సినంత మంది వైదికులు దొరకకలేదు. పరమాచార్య స్వామివారు నాపేరు సిఫారసు చేసి వేరే వాళ్లతో పాటుగా ఆ కార్యక్రమంలో వైదికునిగా పాలుపంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. భోజనాలు అయిన తరువాత నన్ను పిలిచి సహస్ర గాయత్రి చెయ్యమన్నారు. ఆ ఆరాధనలో వైదికునిగా పాల్గొన్నదానికి పరిహారంగా.

నాకు చెంగల్పేట్ న్యాయాలయానికి బదిలీ అవ్వడంతో నాకు పరమాచార్య స్వామివారి దర్శన భాగ్యం తగ్గిపోయింది. కాబట్టి ప్రతి నెల అనుషం (స్వామివారి జన్మ నక్షత్రమైన అనూరాధ నక్షత్రం) రోజు కాంచీపురానికి వెళ్ళి కామాక్షి అమ్మవారి ఆలయంలో త్రిశతి అర్చన చెయ్యించి, ప్రసాదాన్ని పరమాచార్య స్వామివారికి సమర్పించి వారిని దర్శించుకొనేవాణ్ణి. ఒకసారి అలా వెళ్ళగా శ్రీమఠం ఆరోజు భక్తులతో చాలా రద్దీగా ఉంది. దర్శించుకుని బయటకు వచ్చే భక్తులవద్ద ఉన్నాను నేను. మహాస్వామివారు దగ్గర ఉన్న సేవకునితో “శ్రేష్టిదార్ ని పిలువు” అని ఆదేశించారు.

కొంతమంది మా గుంపువైపు “శ్రేష్టిదార్ శ్రేష్టిదార్” అని అరిచారు. ఎవరో నన్ను తీసుకునివెళ్ళి మహాస్వామివారి ముందు నిలబెట్టారు. వారు స్వామితో, “శ్రేష్టిదార్ ఎవరూ లేరు. కోర్టు నుండి ఈ పెద్ద గుమాస్తా ఉన్నారు” అని చెప్పారు. నేను స్వామితో, “పెరియవ నేను శ్రేష్టిదార్ ను కాను, హెడ్ క్లర్క్ ని అని చెప్పాను”.

కాని స్వామివారు పట్టుబట్టి “ఎందుకు నువ్వు శ్రేష్టిదార్ కాకూడదు?” అని అడిగారు.

నేనూ ఖచ్చితంగానే సమాధానం చెప్పాను. “నాకు దానికి కావాల్సిన విద్యార్హతలు లేవు. నేను కేవలం SSLC ముగించాను. నా కిందన ఉన్నవాళ్ళు న్యాయశాస్త్రంలో BA.,BL, MA.,BL మొదలైనవి పూర్తిచేసినవారు. కాబట్టి విదార్హతలను బట్టి నాకు రాదు. అదీగాక, బెంచిలో ఉన్న జిల్లా న్యాయాధికారి పరమ కఠినుడు కనుక నా పేరును సిఫారసు చెయ్యడు. కాబట్టి నేను శ్రేష్టిదార్ ను కాలేను” అని చెప్పాను. స్వామివారు నాకు వెళ్ళడానికి అనుమతినిచ్చారు.

కొన్నిరోజుల తరువాత చెన్నై న్యాయాలయం నుండి కొంతమంది తనిఖీకి వచ్చారు. వారు నా శక్తి సామర్థ్యాలను పరిశీలించి హైకోర్టు జడ్జికి ఒక రహస్య నివేదిక సమర్పించారు. కొన్నిరోజుల తరువాత నన్ను శ్రేష్టిదార్ గా చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అందరికి ఆశ్చర్యం కలిగింది ఇది ఎలా సాధ్యం అని. కేవలం విద్యార్హతలను బట్టే ఉన్నత పదవులిస్తారు అనుకునే వారికి ఇది ఒక గుణపాఠం.

ఈలోగా, నేను తరువాతి అనుషానికి కాంచీపురం వెళ్ళాను. పరమాచార్య స్వామివారి ముందు కామాక్షి అమ్మవారి ప్రసాదం పెట్టగానే స్వామివారు చెయ్యెత్తి తమ తలపై ఉంచుకుని శ్రేష్టిదార్ (‘హెడ్’, ‘చీఫ్’) అని అర్థం స్ఫురించేట్టుగా నాకు చూపిస్తూ “ఇప్పుడు నిన్ను శ్రేష్టిదార్ అని పిలవొచ్చునా?” అని అడిగారు.

స్వామివారు అలా అనగానే నా వొళ్ళు గగుర్పాటుకు గురి అయ్యింది. నేను ఏమీ మాట్లాడలేకున్నాను. నేను చెయ్యగలిగింది ‘దైవం మానుష రూపేణా’ అన్నట్టుగా నా ఎదురుగా ఉన్న సర్వేశ్వరునికి సాష్టాంగం చేసి నా కన్నీళ్లతో వారి పాదపద్మములను కడగడమే. వారే నాకు ఉద్యోగోన్నతి కల్పించినవారు. జరగబోయేది ఏమిటో ఆ దైవానికే తెలుసు అని ఆరోజే నాకు అర్థం అయ్యింది.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- పి.కె రామనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, July 17, 2019

అత్యవసర చికిత్స

Image result

కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆత్రుతగా స్వామివారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, స్వామివారి పాదాలపై పడి విలపించసాగాడు, “నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా!” అని.

ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు.

ఆ రైతుకి ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు, ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్లిపోవడం వల్ల భయంతో మూర్చిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడంలేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పధ్ధతి ఉంది. కాని ఆ మంత్రం తెలిసిన వారు దగ్గరలో ఎవరూ లేరు.
“సామి మాత్రమే వాణ్ణి కాపాడాలి . . .”

మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. “ఆ పిల్లవాని నుదురుపై పూయండి”.

“సరే సామి”

“మీ ఇంట్లో శీకాయ పుడి ఉందా?”

“ఉంది సామి” అని తలూపాడు.

“పిల్లవాని పెదాలు వేరుచేసి, కొద్దిగా శీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి. చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్మివేస్తే, పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలి తీసుకుంటే, పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి. వెళ్లి పిల్లవాడికి శేకాయ పొడి ఇవ్వు”

ఆ రైతు పరుగున ఇంటికి వెళ్లి స్వామివారు చెప్పినట్టుగా చేశాడు. శీకాయ పొడిని నోటిలో వెయ్యగానే, “చేదు, చేదు” అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు.

పరిస్థితి చక్కబడిన తరువాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రితు భార్యతో స్వామివారు, “ప్రతి రోజూ ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు” అని చెప్పారు.

--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, July 13, 2019

మృష్టాన్నభోజనం


ఈరోజుల్లో టీవీలలో ఎన్నో వంటల కార్యక్రమాలు వస్తున్నాయి. ఆ కార్యక్రమాల్లో ఇచ్చే సూచనలను  సరిగ్గా అర్థం చేసుకుని వండితే, చివరగా తయారయ్యే పదార్ధం తినడానికి యోగ్యంగా ఉంటుందా? అది అనుమానమే.

కొత్త వంటకాలు ఏవీ లేకపోతె, సాధారణంగా చేసే మునక్కాయ సాంబారు లేదా బెండకాయ తాలింపు చేసే విధానాన్నే ఉపయోగించి కొత్త వంటలు చేస్తారు.

స్వామివారు పూర్వాశ్రమంలో ఎన్నడూ వంటింటికి వెళ్ళలేదు; సన్యసించిన తరువాత ఇక వెళ్ళాల్సిన అవసరం లేదు. కాని స్వామివారికి నలభీమపాకంలోని మెళకువలన్నీ తెలుసు. అంతేకాక కొత్త కొత్త వంటలు ఎలా చెయ్యాలో కూడా మంచి నేర్పు.

మేము పండరీపురం నుండి తిరిగొస్తున్నాము. అయిదారు చిన్ని గుడిసెలు ఉన్న ఒక కుగ్రామానికి చేరుకున్నాము. ఒక పెద్ద చెట్టు కింద మకాం ఏర్పాటుచేసుకున్నాము.

పరమాచార్య స్వామివారు భిక్ష పూర్తిచెయ్యగానే, మాకోసం కాస్త ఎక్కువగా వండిన పదార్థాలను ఆరగించి మా భోజనం కూడా పూర్తిచేశాము. అది మధ్యాహ్న విశ్రాంతి సమయం.

హఠాత్తుగా పెద్ద కోలాహలంతో ఇరవై మంది వ్యక్తులు వచ్చారు. వారందరూ చెన్నై ప్రాంతం వారు. శ్రీమఠం మకాం కాబట్టి శ్రీ చంద్రమౌళీశ్వర ప్రసాదంగా మంచి ఆహారం దొరుకుతునదన్న నమ్మకంతో అక్కడకు వచ్చారు.

కాని అప్పుడు శ్రీమఠం ఒక పెద్ద చెట్టు కింద మకాం చేసి ఉంది. వండడానికి కావాల్సిన సరుకులు, పాత్రలు కూడా లేవు. ఇటువంటి విషయాల గురించి మహాస్వామివారు ఎక్కువగా కలతచెందేవారు కాదు. ఆకలితో వచ్చిన వారి కడుపు నింపడమే స్వామివారి లక్ష్యం.

బ్రహ్మచారి రామకృష్ణన్ అని స్వామివారి ఆంతరంగిక సేవకుడు ఉండేవాడు. “అందరికి ఆహారం తయారుచెయ్యి” అని అతణ్ణి ఆదేశించారు స్వామివారు.
రామకృష్ణన్ చేతులు నలుపుతూ నిస్సహాయంగా నిలబడి, “మనం మన మకాం తరువాతి ఊరికి వెళ్ళినతరువాత వారికి వండి పెడతాను” అని తెలిపాడు.
ఇబ్బంది ఉందని పరమాచార్య స్వామివారు అర్థం చేసుకుని, “బియ్యం ఉందా?” అని అడిగారు.

“ఉంది; కాస్త పెసర పప్పు కూడా ఉంది”

“అయితే ఇంకేం! నువ్వు ఏం చేస్తావంటే, బియ్యాన్ని నానబెట్టి కడుగు, ఆ నీటిని మరొక పాత్రలో సేకరించు. డానికి కొద్దిగా ఉప్పు వేసి, నిమ్మకాయ పిండి, నారత్తై ఆకులను కత్తిరించి వెయ్యి. ఇది మజ్జిగ అవుతుంది.

పెసర పప్పుని ఎక్కువగా నీరు పోసి ఉడికించు. నీటిని పప్పును వేరుచేసి, ఆ వేడినీళ్ళకు నిమ్మకాయ వెయ్యి. ఇది రసం అవుతుంది.

ఇప్పుడు ఉడికించిన పెసర పప్పు ఉంది కదా! దానికి కాస్త ఉప్పు, కత్తిరించిన మిరపకాయలు వెయ్యి. అది తాళింపు అవుతుంది” అని ఆదేశించారు.

అరగంటలో మొత్తం సిద్ధం అయ్యింది. ఈలోగా మేము అతిథులకి భోజనానికి ఆకులు, నీరు సమకూర్చాము. మొత్తానికి షడ్రుచుల నాలుక కోసం అన్నం, పెసర పప్పు తాళింపు, రసం, మజ్జిగ తయారుచేసాము.

“ఇది మృష్టాన్న భోజనం” అన్నారొక అతిథి.

“దేవామృతం” అని మరొకరు చెప్పారు.

“ఇంతటి రుచికరమైన భోజనాన్ని ఇంతకుముందెన్నడూ తినలేదు” అన్నారు మూడవవారు.

ఆ మాటలను విని మాలో మేము నవ్వుకున్నాము. అది పరమాచార్య స్వామివారి వాక్కు వల్ల కలిగిన రుచి అని మాకు తెలుసు.

ఆతిథ్యం అన్నది పరమాచార్య స్వామివారిని చూసే నేర్చుకోవాలి. అది ఒక అక్షయ పాత్ర.

--- శ్రీమఠం బాలు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 4

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Wednesday, July 10, 2019

మంగళసూత్రం - సుమంగళి


Image result for sri chandrasekharendra saraswathi mahaswamy

పాలక్కాడ్ జిల్లాలోని మంజపర బ్రాహ్మణ సమూహానికి చెందిన ఆర్.జి. వెంకటాచలం కంచి మఠానికి పెద్ద భక్తుడు. చాలా పెద్ద పెద్ద పదవులనలంకరించి ఇప్పుడు చెన్నైలో జీవిస్తున్నారు. కాని తమ జన్మస్థలం అంటే వల్లమాలిన అభిమానం. దాదాపు యాభైలక్షల రూపాయలు విరాళాలు సేకరించి మంజపరలోని గురువాయురప్పన్ దేవస్థానాన్ని పునరుద్ధరింంచారు. వారికి పరమాచార్య స్వామివారితో అనుభవాలు కోకొల్లలు. భక్తిపారవశ్యంతో వారు ఎప్పుడూ ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు.

ప్రతి సంవత్సరమూ వారు పరమాచార్య స్వామివారి అనుగ్రహం కోసం వచ్చేవారు భిక్షావందనంతో. 1988లో రహదారుల ప్రయాణానికి కొంచం ఆటంకం ఏర్పడడంతో ఆయన రావాల్సిన రోజుకు రారు అని అందరూ తలచారు. కాని ఏలాగో వారు కాంచీపురం చేరుకున్నారు. స్వామివారి దర్శన సమయంలో అతణ్ణి, “నీ సంపాదన ఎంత?” అని అడిగారు. వారు సమాధానం చెప్పగానే వారికి స్వామివారి ఆదేశం అందింది.

”నువ్వు ఇక ఎప్పుడు భిక్షావందనం చెయ్యడానికి వచ్చినా, కొన్ని మంగళసూత్రాలను చెయ్యించి నీతోపాటు తీసుకుని రా” అని చెప్పారు.

ఆయన కొద్దిగా అలోచనలో పడ్డారు. ఏ సాంప్రదాయాన్ని అనుసరించి మంగళసూత్రాలను చెయ్యించాలి. స్మార్త, తెలుగు, అయ్యర్ ఇలా చాలా చాలా ఉన్నాయి కదా. ఏ రకంగా తయారు చేయించాలి? ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అని.

వెంటనే స్వామివారు “ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏ సంప్రదాయమైనా పరవాలేదు. తీసుకుని రా” అని చెప్పారు. వెంకటాచలం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను ఈ విషయమై తన మనసులో ఆలోచిస్తున్నాడు. స్వామివారిని అడగనేలేదు. మరి స్వామివారికి ఎలా తెలిసిసింది? అడగకముందే స్వామివారు సమాధానం ఇవ్వడం అతణ్ణి ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.

ఈ సంఘటన జరిగి మూడు సంవత్సరాలు గడిచిపోయింది. ప్రతి సంవత్సరం లాగే ఆ సంవత్సరం కూడా భిక్షావందనానికి శ్రీమఠానికి వచ్చారు. ఆరోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కొద్ది దూరంలో నిలబడి వెంకటాచలం తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక పెద్ద ముత్తైదువ బహుశా పేదరాలు, స్వామివారితో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతోంది. స్వామివారి ముఖమండలంలో అనంతమైన శాంతి గోచరిస్తోంది.

వెంకటాచలం తనవంతు రాగానే మహాస్వామి వారిముందు నిలబడి, “స్వామివారి ఆదేశం ప్రకారం మంగళసూత్రాలను తెచ్చాను” అని చెప్పాడు. స్వామివారు చేతివేళ్ల శబ్ధంతో ఆ సుమంగళిని దగ్గరకు రమ్మన్నారు. వెంకటాచలం వైపుకి తిరిగి “ఆమె కుమార్తెకి పెళ్ళి అట. మంగళసూత్రం కావాలి అట. తీసుకో ఇక్కడే నీ చేతులతోనే ఆమెకి ఇవ్వు” అని ఆదేశించారు. వెంకటాచలం చాలా సంతోషించారు.

“సార్, నేను చాలా పోగొట్టుకున్నాను. జీవనం సాగించడానికి కూడా కష్టపడ్డాను. అయినాకూడా, ఎప్పుడూ తిరుమాంగల్యాలు చెయ్యించడం మానలేదు. అది పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ కదా? మరి ఎలా వదిలిపెట్టగలను? స్వామివారి ఏమి తెలియదా? అంతా తెలుసు. నా భార్య ఏ బాధాలేకుండా సుమంగళీగానే కన్ను మూసింది. మరి ఇంతకంటె ఇక ఏమి అడగాలి ఆ సర్వేశ్వరుణ్ణి?” అని కంఠం గాద్గదికమవుతుండగా వారి అనుభవాన్ని చెప్పుకొచ్చారు వెంకటాచలం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

అనుష్టానం మానరాదు



1963లో పరమాచార్య స్వామివారు కుంబకోణం దగ్గర్లోని మరుదనల్లూర్ లో మకాం చేస్తున్నారు. అప్పుడు కుంబకోణంలోని కుంబేశ్వర ఆలయంలో ‘తిరుప్పావై - తిరువెంబావై’ సదస్సులు వైభవంగా జరుగుతున్నాయి. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం మరియు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి తిరుప్పణి (ఆలయ సంబంధిత పనులు) చేసిన పి.టి. రాజన్ ఆ సదస్సుకు వచ్చారు.

అప్పుడు సాయం సంధ్యా సమయం. మహాస్వామి వారి ఉపన్యాసం వినాలని వారి వద్దనే కూర్చుని ఉన్నాను. స్వామివారు ఉపన్యాసం మొదలుపెట్టబోతూ నావైపు తిరిగి, చేతులతో ఆచమనం చేస్తున్నట్టుగా చూపిస్తూ వెళ్ళి సంధ్యావందనం చెయ్యమని ఆజ్ఞాపించారు. స్వామి ఉపన్యాసం వినాలనే కోరికతో నేను సంధ్యావందనం మాని అక్కడ కూర్చున్నానని స్వామివారు అర్థం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితులలోను అనుష్టానం మానవద్దు అని నన్ను హెచ్చరించటం. స్వామివారి ఆజ్ఞ ప్రకారం సంధ్య వార్చడానికి నేను కొలను వద్దకు వెళ్ళాను.

ఆ రోజు రాత్రి పదిగంటలప్పుడు మేము ఆహ్వానించకుండానే స్వామివారు మేలకావేరిలోని మా ఇంటికి విచ్చేశారు. దాదాపు ఒక గంట పాటు అనుగ్రహ భాషణం చేశారు. మేము పరమానంద భరితులమయ్యాము. అలా స్వామివారు బ్రాహ్మణుడికి సంధ్యావందనం వంటి నిత్యకర్మల కంటే మేలైనది విలువైనది వేరొక్కటి లేదని సెలవిచ్చారు. అలా ధర్మానుష్టానం చేసిన వారి వద్దకు స్వామివారే వచ్చి అనుగ్రహం ఇస్తారు. అలా ఆచరించని వారు మాత్రమే స్వామిని వెతుక్కుంటూ వెళ్ళాలి.

--- యస్. పంచపకేశ శాస్తిగళ్, కుంబకోణం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, June 15, 2019

సుద్యుమ్నుడు - ఇళ



Image result for sudyumna

సంసార జీవితంలో భార్యా, భర్త, ఇద్దరూ ఒక మాట మీదనే నిలబడి ఒక బాటలోనే నడవాలని అలా కాని పక్షంలో భవిష్యత్తు విచిత్రమైన మార్పులు పొందుతూ ఉంటుందని అవి వారి సంతానాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయనే విషయాన్ని సుద్యుమ్నుడి కథ తెలుపుతుంది. అలాగే భారతం కేవలం పురాణ గ్రంథమే కాదని అందులో ఈనాడు వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకు కనిపిస్తున్న ఎన్నో అద్భుతాలు ఆనాటి వారు ­హ మాత్రంగానయినా ఆలోచించగలిగారనే విషయాన్ని మహాభారతంలోని కథ, సాహిత్యం వివరిస్తోంది. వైవశ్యత మనువు భార్య శ్రద్ధాదేవి, వైవశ్యత మనువు తన భార్యతో కలిసి పుత్రకామేష్టియాగం ప్రారంభించాడు. శ్రద్ధాదేవికి తనకు కూతురు జన్మిస్తే బాగుండుననే అభిప్రాయం కలిగింది. ఒక రోజున ఆమె యాగం చేస్తున్న హోత వద్దకు వెళ్ళి నమస్కరించి తనకు కూతురు కలిగేలా యాగం చేయమని ప్రార్థించింది. ప్రార్థనను మన్నించి హోమం చేశారు. పుత్రకామేష్టి పూర్తయిన తర్వాత శ్రద్ధాదేవికి కూతురు జన్మించింది. 

                           ఆ శిశువుకు ‘ఇళ’ అని పేరు పెట్టారు. కానీ వైవశ్యత మనువు యజ్ఞ బ్రహ్మ వశిష్టుడి వద్దకు వెళ్ళి పుత్రుడికి బదులుగా పుత్రిక జన్మించిందని తన కోరిక ఎందుకు భగ్నమైందని అడిగాడు. వశిష్టుడు దివ్యదృష్టితో జరిగినదంతా తెలిసికొని తన శక్తితో ఇళను బాలుడిగా మార్చాడు. ఆ బాలుడికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు. సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడతడు తన మంత్రిగణంతో వేటకు వెళ్ళి చాలాసేపు సింహాలను, పులులను వేటాడి అలసి ఆ సమీపంలో ఉన్న ఒక కొలనులో ఉన్న నీటిని తాగారు. వెంటనే సుద్యుమ్నుడు, అతడి పరివారం గుర్రాలతో సహా ఆడవారిగా మారిపోయారు. దానికి కారణం పూర్వం ఆ ప్రాంతంలో పురుష సంచారాన్ని నిషేధిస్తూ పార్వతి కోరిక మేరకు పరమేశ్వరుడు శాపం ఇవ్వడమే. సుద్యుమ్నుడు అతడి పరివారం స్త్రీలుగా మారడంతో తిరిగి తమ రాజ్యానికి వెళ్ళలేక అక్కడక్కడ తిరగడం ప్రారంభించారు. ఒకనాడు అక్కడికి సమీపంలో ఉన్న బుధుడి ఆశ్రమానికి వెళ్ళడం తటస్థించింది. బుధుడి కొడుకైన చంద్రుడు రాజస్త్రీగా ఉన్న సుద్యుమ్నుడి (ఇళ) మీద మనసు పడ్డాడు. వారిద్దరి సమాగ ఫలితంగా కొన్నాళ్ళకు వారికి పురూరవుడు జన్మించాడు. కొంత కాలం గడిచిన తరువాత సుద్యుమ్నుడు తనకు బాల్యంలో ఆడరూపు పోగొట్టి మగరూపు తెప్పించిన వశిష్టుని తలుచుకున్నాడు. 

                    వశిష్టుడు అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. తన శిష్యుడు ప్రస్తుతం ఉన్న ఆడ రూపును పోగొట్టి మగ రూపును ప్రసాదించమన్న కోరికను తీర్చలేక శివుడిని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై పార్వతికి ఇచ్చిన మాటను తోసివేయక వశిష్టుని కోరికను కాదనలేక ఉభయ తారకంగా ఉండే విధంగా ఒక మాసం మగవాడుగా, ఒక మాసం ఆడదిగా సుద్యుమ్నుడు ఉండే విధంగా అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. సుద్యుమ్నుడు అప్పటికి ఆనందించి తిరిగి రాజ్యానికి వెళ్ళి పురుష రూపంగా ఉన్నప్పుడు మాత్రమే రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఆ కాలంలో సుద్యుమ్నునకు.. ఉత్కళుడు, గయుడు, విమలుడు అను ముగ్గురు కుమారులు కలిగారు. వారు ఉత్తరరాజ్య భాగాలకు రాజులయ్యారు.  తమ రాజు కొన్ని మాసాలు మాత్రమే పరిపాలన చేస్తుండడం ప్రజలకు వింత అనిపించి ఆనోటా ఆ నోటా అసలు విషయం తెలుసుకున్నారు. ఈ లోగా సుద్యుమ్నుడి కొడుకు పురూరవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. సుద్యుమ్నుడు ప్రజలు తనను గురించి అనుకునే పలు రకాల మాటలు వినలేక సుద్యుమ్నునకు ఈ జీవితమంటే రోత పుట్టింది. అతను తన పుత్రుడు పురూరవునకు ప్రతిష్ఠానపుర రాజ్య సింహాసనం  అప్పగించి తపోవనాలకు వెళ్లిపోయాడు.  సుద్యుమ్నుడి తల్లిదండ్రులు ఏకాభిప్రాయం కలిగి ఉండకపోవడం ఈ కథలోని ఇన్ని మార్పులకు, సుద్యుమ్నుడి మనోవేదనకు కారణమైంది.




- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ